ప్రదీప్‌ సాంగ్‌ను ఆవిష్కరించిన మహేష్‌.. 

యాంకర్‌ ప్రదీప్‌ మాచీరాజు హీరోగా తెరకెక్కుతున్న తొలి చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ . ఎస్వీ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై ఎస్వీ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మున్నా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రదీప్‌ సరసన అమ్రిత హీరోయిన్‌గా నటిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా మ్యూజికల్‌ పోస్ట్‌ర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి తొలి వీడియో సాంగ్‌ను సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు ఆవిష్కరించారు. ఈ 30 రోజుల్లో ప్రేమించటం ఎలా? చిత్రం నుంచి మొదటి సాంగ్‌ లాంచ్‌ చేస్తున్నందకు ఆనందంగా ఉందని మహేష్‌ తెలిపారు. పాట చాలా బాగుందన్న మహేష్‌.. ప్రదీప్‌తోపాటు చిత్ర బృందానికి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు.